Uttar Pradesh: రాయ్ బరేలీ నుంచి సోనియా, ప్రియాంక ఎవరూ పోటీ చేసినా ఓటమే!: బీజేపీలో చేరుతున్న కాంగ్రెస్ నేత

  • రాయ్ బరేలీ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు పరాభవం తప్పదు
  • నా తమ్ముడ్ని పోటీ చేయకుండా ప్రియాంకా గాంధీ అడ్డుకుంది
  • అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్న ప్రతాప్ సింగ్

రాయ్ బరేలీ నుంచి 2019 లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేసినా ఓటమి తప్పదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రెండుసార్లు ఎమ్మెల్సీ అయిన ప్రతాప్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. అమిత్ షా సమక్షంలో నేడు బీజేపీలో చేరనున్న సందర్బంగా ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తన తమ్ముడు రాకేశ్ సింగ్ పోటీ చేయకుండా ప్రియాంకా గాంధీ అడ్డుపడ్డారని ఆరోపించారు.

తన తమ్ముడు బీజేపీ నుంచి బరిలో దిగుతానని అడిగితే.. అన్నదమ్ములు వేర్వేరు పార్టీల్లోంచి పోటీ చేయడం బాగుండదని, తన సోదరుడికి టికెట్ కేటాయించాలని ప్రియాంకా గాంధీని టికెట్ అడిగానని, దానికి ఆమె రాయ్ బరేలీ నియోజకవర్గంలో నలుగురు ఠాకూర్లకు టికెట్లు ఇవ్వడం కుదరదని అన్నారని మండిపడ్డారు. ఈ సారి రాయ్ బరేలీలో కాంగ్రెస్ కు పరాభవం తప్పదని ఆయన చెప్పారు. కాగా, రాయ్ బరేలీ గాంధీ కుటుంబానికి పెట్టని కోట. ఇక్కడి నుంచే సోనియాగాంధీ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

More Telugu News