surya: సూర్యతో సెల్వరాఘవన్ .. షూటింగుకి రకుల్

  • సూర్య హీరోగా 'ఎన్.జి.కె.'
  • దర్శకుడిగా సెల్వరాఘవన్ 
  • కథానాయికలుగా రకుల్ .. సాయిపల్లవి

కెరియర్ మొదటి నుంచి కూడా తనకీ .. అభిమానులకి మధ్య సూర్య ఎంతమాత్రం గ్యాప్ రానీయలేదు. పరాజయాలు ఎదురైనా వాటిని నవ్వుతూ స్వీకరిస్తూనే, తదుపరి ప్రాజెక్టులను లైన్లో పెడుతూ ముందుకు వెళుతున్నారు. అలా ఇప్పుడు ఆయన తన 36వ సినిమాను సెల్వరాఘవన్ తో చేస్తున్నాడు. ఈ సినిమాకి ఎన్.జి.కె. అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు.

సూర్యకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన తరువాత, తమిళనాడు చిత్రపరిశ్రమలో జరిగిన సమ్మె కారణంగా ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల క్రితం ఆగిపోయింది. రీసెంట్ గా ఆ సమస్య పరిష్కారం కావడంతో, ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ రోజునే మొదలైంది. ఈ రోజు నుంచి ఈ సినిమా షూటింగులో రకుల్ కూడా పాల్గొంటుంది. ఈ సినిమాలో మరో కథానాయికగా సాయిపల్లవి కనిపించనుందనే సంగతి తెలిసిందే.      

More Telugu News