Nani: ఎన్టీఆర్ కు రూ. 6.5 కోట్లు ఇచ్చిన 'బిగ్ బాస్'... నానీకి మాత్రం ఇంచుమించు సగమే!

  • రెండో సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించనున్న నానీ
  • రూ. 3.5 కోట్ల పారితోషికం
  • ప్రతి వారం రెండు రోజుల పని
  • గతంలో ఎన్టీఆర్ కు రూ. 6 కోట్లు

రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు వర్షన్ రెండో సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించేందుకు హీరో నానీకి అందనున్న పారితోషికం ఎంతో తెలుసా? తొలి సీజన్ లో హోస్ట్ గా వ్యవహరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు రూ. 6.5 కోట్లు ఇచ్చిన బిగ్ బాస్ నిర్వాహకులు, ఇప్పుడు నానీకి అందులో సగానికి కొంచెం ఎక్కువగా మాత్రమే ఆఫర్ చేస్తున్నారట. ఈ షో చేసినందుకు నానీకి రూ. 3.5 కోట్ల రెమ్యునరేషన్ దక్కనున్నట్టు తెలుస్తోంది.

దాదాపు రెండున్నర నెలల పాటు ప్రతి వారాంతంలో రెండు రోజులు అంటే, సుమారు 20 రోజుల పాటు తన సినిమాలను, కాల్ షీట్లను పక్కనబెట్టి నాని పని చేయాల్సి వుంటుంది. ఎన్టీఆర్ మార్కెట్ వాల్యూ, ఫ్యాన్ ఫాలోయింగ్ తో పోలిస్తే నాని చిన్న హీరోయే కాబట్టి రూ. 3.5 కోట్లు తక్కువేమీ కాదన్నది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం.

More Telugu News