Donald Trump: అనుకున్నది సాధించా... ఇక నో న్యూక్లియర్ టెస్ట్: ప్రామిస్ చేసిన కిమ్ జాంగ్ ఉన్

  • క్షిపణి పరీక్షలు నిలిపివేశాం
  • ఇకపై నిర్వహించేది లేదు
  • కిమ్ జాంగ్ ఉన్ ప్రకటన
  • స్వాగతించిన ట్రంప్

ఇకపై ఎటువంటి అణ్వస్త్ర పరీక్షలను నిర్వహించబోమని, ఖండాంతర క్షిపణి పరీక్షలనూ నిలిపివేస్తున్నామని, అటామిక్ టెస్ట్ సైట్ ను మూసివేస్తున్నామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కీలక ప్రకటన చేశారు. అమెరికాతో సత్సంబంధాలను కోరుకుంటున్న ఉత్తర కొరియా ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేయగా, వెంటనే దాన్ని స్వాగతిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

తాము ఎంతోకాలంగా పాంగ్ యాంగ్ డిక్లరేషన్ ను కోరుతున్నామని, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం బలోపేతం అవుతుందని, కొరియన్ ద్వీపకల్పంలో శాంతికి ఈ ప్రకటన దోహద పడుతుందని పేర్కొంది. కాగా, గత వారంలో కిమ్ జాంగ్ ఉన్, సౌత్ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ తో సమావేశం కావడం, అమెరికా దౌత్యాధికారులతో భేటీ తరువాత పరిస్థితులు మారాయన్న సంగతి తెలిసిందే. తాము అణ్వస్త్ర పరీక్షల్లో గొప్ప విజయం సాధించామని, తాను అనుకున్నది చేశాను కాబట్టి, ఇకపై న్యూక్లియర్ టెస్టులు ఉండబోవని ఈ సందర్భంగా కిమ్ వ్యాఖ్యానించారు.

More Telugu News