Chicken pelvis: ఇది 'కోడి పుంజు' గుడ్డు... ఖమ్మం జిల్లాలో వింత!

  • రెండు గుడ్లు పెట్టిన కోడి పుంజు
  • తొలి సారి పెంకు లేకుండా గుడ్డు
  • ఈ సారి పెంకుతో చిన్న గుడ్డు

కోడిపుంజు గుడ్డుపెట్టిన అరుదైన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం గ్రామానికి చెందిన ఆలస్యం శ్రీనివాసరావు తన ఇంట్లో కోడిపుంజును పెంచుకుంటున్నారు. ఆ పుంజు గత నెల ఒక గుడ్డుపెట్టింది. దీంతో ఆశ్చర్యపోయిన ఆయనకు ఆ గుడ్డు పుంజుదా? పెట్టదా? అన్న అనుమానం వచ్చింది. దీంతో ఆ కోడిపుంజును కట్టేసి మేపసాగారు.

ఈ సారి మాత్రం ఏమాత్రం అనుమానం లేకుండా పుంజే గుడ్డు పెట్టింది. ఈ గుడ్డు సాధారణ గుడ్డుతో పోలిస్తే చిన్నగా ఉంది. దీనిపై పశువైద్యాధికారి కె.కిషోర్ మాట్లాడుతూ, జన్యు పరివర్తనాల వల్ల ఇటువంటి సంఘటనలు అరుదుగా చోటుచేసుకుంటాయని అన్నారు. కోడి పుంజులు పెట్టే గుడ్లను విండ్ గుడ్లు అంటారని తెలిపారు. మొదటి సారి పెంకు లేకుండా పెట్టే గుడ్లను పుల్లెట్ గుడ్లు అంటారని చెప్పారు. ఈ గుడ్డులో పచ్చసొన ఉండదని తెలిపారు. దీంతో ఈ గుడ్డు పునరుత్పత్తికి పనికిరాదని ఆయన వెల్లడించారు. 

More Telugu News