Shruti: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • శ్రుతి హాసన్ హిందీ సినిమా మొదలైంది 
  • చైనాలో భారీ ఎత్తున 'బాహుబలి 2' విడుదల 
  • కమల్ సినిమా తర్వాత రజనీ 'కాలా' 
  • రేపు రవితేజ 'నేల టిక్కెట్టు' టీజర్  

*  గత కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా వున్న కథానాయిక శ్రుతి హాసన్ తాజాగా నటిస్తున్న హిందీ చిత్రం షూటింగ్ నిన్న మొదలైంది. మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విద్యుత్ జమ్వాల్ కు జోడీగా శ్రుతి నటిస్తోంది.
*  ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని మూటగట్టుకున్న 'బాహుబలి 2' చిత్రాన్ని చైనాలో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మే 4న ఈ చిత్రాన్ని చైనాలో విడుదల చేస్తున్నట్టు సమాచారం. ఇటీవలే జపాన్ లో ఈ చిత్రం వంద రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుంది.
*  తమిళనాడులో థియేటర్ల బంద్ ముగిసిన నేపథ్యంలో ఆయా సినిమాల విడుదలపై ఓ స్పష్టత వస్తోంది. ఇప్పటికే విడుదలకు రెడీగా వున్న కమలహాసన్ 'విశ్వరూపం 2', రజనీకాంత్ 'కాలా' చిత్రాలు రిలీజ్ డేట్స్ ను ఖరారు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో వచ్చే నెలలో 'విశ్వరూపం 2', జూన్ లో 'కాలా' విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
*  రవితేజ హీరోగా నటిస్తున్న 'నేల టిక్కెట్టు' చిత్రం టీజర్ ను రేపు రిలీజ్ చేస్తున్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ మరోసారి పక్కా మాస్ పాత్రలో కనిపిస్తాడు.    
 

More Telugu News