sivaji: బాలయ్యతో తొడ కొట్టించిన హీరో శివాజీ

  • ధర్మ పోరాట దీక్షలో శివాజీ ప్రసంగం
  • తొడ కొట్టాలంటూ బాలయ్యను అడిగిన శివాజీ
  • బాలయ్య చెప్పినట్టు మోదీకి దండోపాయమే కరెక్ట్ అన్న హీరో

విజయవాడలో చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. హీరో శివాజీ ప్రసంగిస్తుండగా ఎమ్మెల్యే బాలకృష్ణ వేదికపైకి వచ్చి, శివాజీ పక్కన నిల్చుచున్నారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ, జనాలు రోడ్లెక్కి నిరసన కార్యక్రమాలను చేపట్టడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించరని... కానీ కేంద్రాన్ని కదిలించాలంటే అందరం రోడ్డెక్కాల్సిందేనని చెప్పారు. కర్ర తీసుకొని కొడితేనే గుజరాత్ వాళ్లు వింటారని, మామూలుగా అయితే వారు మాట వినరని అన్నారు. మోదీ మామూలుగా మాట వినడని... బాలకృష్ణ చెప్పినట్టు దండోపాయమే కరెక్ట్ అని చెప్పారు. ఈ సందర్భంగా 'ఒక్కసారి తొడకొట్టండి మీరు' అంటూ బాలయ్యను అడిగారు. వెంటనే బాలకృష్ణ తొడకొట్టడంతో అక్కడున్నవారంతా హుషారుగా విజిల్స్ వేశారు. అనంతరం శివాజీ మాట్లాడుతూ, తొడకొట్టి, మీసం మెలేసి చెబుతున్నామని... ప్రత్యేక హోదాను సాధిస్తామని, అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటామని అన్నారు.

More Telugu News