cricketer shami: అవసరమైతే క్రికెటర్ షమీని మరోసారి విచారణకు పిలుస్తాం: కోల్ కతా పోలీసులు

  • షమీ స్టేట్ మెంట్ అంతా రికార్డు చేశాం
  • భార్య చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని షమీ చెప్పాడు
  • షమీ తల్లి, సోదరుడి భార్యను త్వరలోనే ప్రశ్నిస్తాం
  • షమి పాస్ పోర్టును సీజ్ చేయలేదు

టీమిండియా పేసర్ మహమ్మద్ షమీపై అతని భార్య హసీన్ జహాన్ ఆరోపణల మేరకు గృహహింస చట్టం కింద కోల్ కతా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ నిమిత్తం రెండు రోజుల క్రితం షమీ హాజరయ్యాడు. ఈ విషయమై కోల్ కతా పోలీసులు మాట్లాడుతూ, అవసరమైతే షమీని మరోసారి విచారణకు పిలుస్తామని అన్నారు. షమీ స్టేట్ మెంట్ అంతా రికార్డు చేశామని, భార్య చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని షమీ చెప్పాడని అన్నారు.

దక్షిణాఫ్రికా టూర్ అనంతరం షమీ దుబాయ్ వెళ్లిన విషయమై కూడా ప్రశ్నించామని, పాకిస్థాన్ అమ్మాయి స్టేట్ మెంట్ తీసుకోవాలా? వద్దా? అనే విషయమై ఆలోచిస్తున్నట్టు చెప్పారు. షమీ తల్లి, సోదరుడి భార్య పేర్లు ఎఫ్ఐఆర్ లో ఉన్నాయని, తమ బృందం ఒకటి త్వరలోనే ఉత్తరప్రదేశ్ వెళ్లి వారిని ప్రశ్నించనుందని చెప్పారు. ఈ సందర్భంగా షమీ పాస్ పోర్టు గురించి ప్రస్తావిస్తూ, అతని పాస్ పోర్టును తాము సీజ్ చేయలేదని, అతను ఐపీఎల్ ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.

More Telugu News