siddaramaiah: ఎన్నికల ప్రచారంలో చంద్రబాబును ప్రస్తావించిన కర్ణాటక ముఖ్యమంత్రి

  • ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ ప్రామిస్ చేశారు
  • చివరకు హోదాను, చంద్రబాబును తొక్కేసే ప్రయత్నం చేశారు
  • మనకు కూడా మోదీ ఎన్నో హామీలు ఇస్తారు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పోటీగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలోనే మకాం వేసి, గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై సిద్ధరామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు. ఆయనను ఒక నమ్మక ద్రోహిగా అభివర్ణించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా, ముఖ్యమంత్రి చంద్రబాబులను ఆయన ప్రస్తావించారు.

 'ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హాదా ఇస్తామంటూ మోదీ ప్రామిస్ చేశారు... అయితే, చివరకు ప్రత్యేక హోదాతో పాటు చంద్రబాబును కూడా తొక్కేసే ప్రయత్నం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ తరహాలో మన రాష్ట్రానికి కూడా ఎలాంటి హామీలనైనా ఇవ్వడానికి మోదీ ఏమాత్రం సంశయించడం లేదని చెప్పారు. ఇప్పటికే బెంగళూరు గర్వించదగ్గ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ నుంచి రాఫెల్ కాంట్రాక్టును ఇతర ప్రాంతానికి తరలించారు' అంటూ ట్వీట్ చేశారు. తద్వారా మోదీ ఇచ్చే హామీలను కర్ణాటక ఓటర్లు నమ్మవద్దని కోరారు. 

More Telugu News