Pawan Kalyan: ‘తిక్క లేచింది.. ఇక లెక్కలు తేలిపోతాయి..’ : హీరో సందీప్ కిషన్

  • పవన్ కల్యాణ్ కు మద్దతు తెలిపిన మరో హీరో
  • పవర్ స్టార్.. నేను ఈయనకు పెద్ద అభిమానిని
  • ఓ ట్వీట్ చేసిన సందీప్ కిషన్

అగ్రహీరో పవన్ కల్యాణ్ తల్లిపై నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పలువురు సినీ నటులు, పవన్ అభిమానులు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ‘మెగా’ కుటుంబం కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ లో న్యాయవాదులతో పవన్ కల్యాణ్ ఈరోజు సమావేశమయ్యారు. పవన్ కు మద్దతుగా ‘మెగా’ కుటుంబం తరలివచ్చింది.

 ఈ సందర్భంగా పవన్ కు మద్దతు తెలుపుతూ హీరో సందీప్ కిషన్ ఓ ట్వీట్ చేశాడు. ఫిలిం చాంబర్ వద్దకు తాను రాలేకపోయానని సందీప్ కిషన్ తన ట్వీట్ లో ప్రస్తావించాడు. ‘పవర్ స్టార్.. నేను ఈయనకు పెద్ద అభిమానిని కానీ ఆయన్ని చూడలేకపోయాను. తిక్క లేచింది..లెక్కలు తేలిపోతాయి..’ అని సందీప్ కిషన్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఫిలించాంబర్ వద్ద ఉన్న పవన్ కల్యాణ్ ఫొటోను పోస్ట్ చేశాడు.

More Telugu News