Mahesh Babu: మహేశ్ హిట్ కొట్టేశాడంటున్న అభిమానులు .. సంబరాలు!

  • ఈ రోజునే థియేటర్లకు 'భరత్ అనే నేను'
  • విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్ 
  • ఆనందంతో పొంగిపోతోన్న అభిమానులు    

మహేశ్ బాబు కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'భరత్ అనే నేను' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో ఈ సినిమాతో మహేశ్ హిట్ కొట్టేసినట్టేనని అభిమానులు భావిస్తున్నారు .. థియేటర్ల దగ్గర సంబరాలు జరుపుకుంటున్నారు.

కొరటాల తయారు చేసిన బలమైన కథాకథనాలు .. మహేశ్ బాబు నటన .. ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయని అంటున్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిందని చెబుతున్నారు. ఈ కారణంగానే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందనీ .. వేసవి సెలవుల కారణంగా భారీ ఓపెనింగ్స్ వచ్చాయనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.  

More Telugu News