Congress: కాంగ్రెస్ బస్సుయాత్రలో రాహుల్ గాంధీ పాల్గొంటారు!: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్

  • ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశాను
  • తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించాం
  • ఇటీవల బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేల అంశం ప్రస్తావించాం
  • కేసీఆర్, మధుసూదనాచారి తమ పదవులకు రాజీనామా చేయాలి

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని టీపీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉత్తమ్ ఈ రోజు రాహుల్ ను కలిసి పలు విషయాలపై చర్చించారు. అనంతరం, మీడియాతో ఉత్తమ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ త్వరలో చేపడుతున్న బస్సుయాత్ర లో రాహుల్ గాంధీ పాల్గొననున్నట్టు చెప్పారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై, ఇటీవల బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ కు హైకోర్టులో ఊరట లభించిన విషయాన్ని రాహుల్ గాంధీకి వివరించామని, ఈ విషయమై హైకోర్టులో పోరాడిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ఆయన అభినందనలు తెలిపారని అన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై ఉత్తమ్ విమర్శలు గుప్పించారు. చేతిలో అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరిస్తే తాము చూస్తూ ఊరుకోమని, ప్రభుత్వానికి స్పీకర్ వత్తాసు పలుకుతూ అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు. తమ పదవులను దుర్వినియోగ పరుస్తున్న కేసీఆర్, మధుసూదనాచారి రాజీనామా చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

More Telugu News