జగన్ దరిద్రమే వైయస్ ప్రాణాలను బలిగొంది: ఆదినారాయణ రెడ్డి

20-04-2018 Fri 14:45
  • జగన్ సీఎం అయితే రాష్ట్రాన్ని తాకట్టు పెడతారు
  • చంద్రబాబు దీక్షతో మరో ప్రజా ఉద్యమం వస్తుంది
  • ఏపీకి న్యాయం జరిగేంత వరకు పోరాటాలు ఆగవు

వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖరరెడ్డి మరణానికి జగన్ దరిద్రమే కారణమని అన్నారు. పొరపాటున జగన్ ముఖ్యమంత్రి అయితే... ఏపీని విదేశాలకు తాకట్టు పెడతారంటూ ఆరోపించారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా కడపలో ఆదినారాయణ రెడ్డి దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని నాలుగేళ్లుగా ఎదురు చూశామని... చివరకు విసిగిపోయి దీక్షకు దిగామని తెలిపారు. చంద్రబాబు దీక్షతో మరో ప్రజా ఉద్యమం వస్తుందని అన్నారు. ఏపీకి న్యాయం జరిగేంత వరకు పోరాటాలు ఆగవని చెప్పారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు ఒక డ్రామా అంటూ కొట్టిపారేశారు.