bombay high court: భారత్ అంటే నేరాలు, అత్యాచారాలు జరిగే ప్రాంతమనే భావన ఏర్పడుతోంది: బాంబే హైకోర్టు

  • భారత్ తో సంబంధాలకు వెనుకంజ
  • ఉదారవాద, లౌకిక వాదులకు రక్షణ లేదన్న అభిప్రాయం
  • ఈ పరిస్థితి రావడం దురదృష్టకరం

భారత్ అంటే నేరాలు, అత్యాచారాలు జరిగే దేశమనే భావన విదేశాల్లో పెరిగిపోతోందని, ఉదారవాద, లౌలిక ప్రజలకు ఈ దేశం సురక్షితం కాదన్న అభిప్రాయం ఏర్పడుతోందని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. కతువా, ఉన్నావో అత్యాచార కేసులపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న తరుణంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

నరేంద్ర దబోల్కర్, కమ్యూనిస్ట్ నేత గోవింద్ పన్సారే హత్యలపై కోర్టు ఆధ్వర్యంలో విచారణ కోరుతూ బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ ఎస్ సీ ధర్మాధికారి, జస్టిస్ భారతీ డాంగ్రేతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. భారత్ లో ఉన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ దేశంతో విద్యా, సాంస్కృతిక సంబంధాలకు విదేశాలు వెనుకాడే పరిస్థితి వచ్చిందని పేర్కొంది. నేరాలు, అత్యాచారాలు భారత్ లోనే జరుగుతాయని విదేశీయులు భావించే పరిస్థితి రావడం దురదృష్టకరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

More Telugu News