ipl: ఐపీఎల్ జోరుతో ప్రపంచ సంప్రదాయ క్రికెట్ కనుమరుగవుతుంది: లలిత్ మోదీ

  • ఫ్రాంఛైజీలకు విధించిన 12 కోట్ల నిబంధన ఎత్తేస్తే ఆటగాళ్లకు సంపాదించే అవకాశం
  • ఒక్కో మ్యాచ్ కు 6.60 కోట్లు సంపాదించే అవకాశం
  • దేశాలకు ప్రాతినిధ్యం వహించడం కంటే ఐపీఎల్ లో ఆడేందుకే మొగ్గు చూపుతారు

ఐపీఎల్ జోరుతో ప్రపంచ దేశాల మధ్య జరిగే సంప్రదాయ క్రికెట్ కనుమరుగవుతుందని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ పై లండన్ లో మాట్లాడుతూ, ప్రపంచ క్రికెట్ తో పోల్చుకుంటే దేశవాళీ క్రికెట్ 20 రెట్లు పెద్దదని అన్నాడు. ఐపీఎల్ లో ఆటగాళ్ల కొనుగోలుకు ఫ్రాంఛైజీలకు విధించిన 12 మిలియన్ డాలర్ల నిబంధన ఎత్తేస్తే ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్, ఎన్ఎఫ్ఎల్ మాదిరి క్రికెటర్లు సంపాదించే అవకాశం ఉందని, ఆ తరువాత ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్‌ కు ఒక మిలియన్‌ డాలర్లు (సుమారు 6.60 కోట్ల రూపాయలు) చెల్లించే రోజు వస్తుందని పేర్కొన్నాడు.

అప్పుడు క్రికెటర్లు ఆయా దేశాల బోర్డులకు ప్రాతినిధ్యం వహించడం కంటే ఐపీఎల్‌ లో ఆడేందుకే మొగ్గు చూపుతారని లలిత్ మోదీ తెలిపాడు. ఆ తరువాత ఐపీఎల్‌ ను మరింత విస్తరిస్తే భారత్‌ ను బహిష్కరిస్తామని ఐసీసీ బెదిరింపులకు దిగే అవకాశం కూడా లేకపోలేదని అభిప్రాయపడ్డాడు. ఐతే సొంతకాళ్లపై నిలబడే సత్తా భారత్‌ సొంతమని విశ్వాసం వ్యక్తం చేశాడు. ప్రపంచ క్రికెట్‌తో పోల్చుకుంటే భారత దేశవాళీ క్రికెట్‌ 20 రెట్లు పెద్దదని మోదీ పేర్కొన్నాడు. 

More Telugu News