Chandrababu: భగవంతుడు సంపూర్ణ ఆయుష్షును, ఆరోగ్యాన్ని ప్రసాదించాలి.. చంద్రబాబుకు మోదీ గ్రీటింగ్స్!

  • విభేదాలను పక్కనపెట్టి చంద్రబాబుకు శుభాకాంక్షలు
  • బాబుకు సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుష్షును ప్రసాదించాలని కోరుకుంటున్నానన్న మోదీ
  • ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుకు సంపూర్ణ ఆయుష్షును, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుతున్నానని ట్వీట్ చేశారు. ప్రస్తుతం మోదీ విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో మోదీకి, చంద్రబాబుకు మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు మోదీని చంద్రబాబు ఏదో ఒక సందర్భంలో బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబుకు మోదీ శుభాకాంక్షలు తెలపడం ఆసక్తికరంగా మారింది. 

More Telugu News