chief justice: ప్రధాన న్యాయమూర్తి అభిశంసన సహా పలు అంశాలపై నేడు ప్రతిపక్షాల సమావేశం

  • జస్టిస్ లోయా మృతిపై సుప్రీం తాజా తీర్పు నేపథ్యం
  • చీఫ్ జస్టిస్ ను సాగనంపే తీర్మానానికి యత్నం 
  • నేడు గులాంనబీ అజాద్ చాంబర్లో సమావేశం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసన అంశం మరోసారి ప్రతిపక్షాల మధ్య చర్చకు రానుంది. కాంగ్రెస్ పార్టీ నేత గులాంనబీ అజాద్ పార్లమెంట్ చాంబర్ లో పలు పార్టీల నేతలు ఈ రోజు సమావేశం కానున్నారు. ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చ జరగనుంది. జడ్జి బీహెచ్ లోయా మృతి సహజమేనని, దీనిపై పిటిషన్లు దురుద్దేశంతో కూడినవని, న్యాయవ్యవస్థకు కళంకం తెచ్చేవిగా ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే.

 లోయా మృతిపై తాజా తీర్పు నేపథ్యంలో చీఫ్ జస్టిస్ పై అభిశంసన తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్లే అంశంపై కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో చర్చించనుంది. లోయా మృతిపై సుప్రీం తీర్పు తర్వాత బీజేపీ నేతలు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సహా ఇతర నేతలపై మాటల దాడి మొదలు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ప్రధాన న్యాయమూర్తి అభిశంసన విషయమై కాంగ్రెస్ ప్రతిపక్షాల మద్దతు కూడగట్టే చర్యల్ని ముమ్మరం చేయనుంది. ఇప్పటికే ఎన్ సీపీ, వామపక్షాలు ఈ విషయమై సానుకూలంగా ఉన్నాయి.

More Telugu News