Viral Videos: ద్విచక్ర వాహనంపై వెళుతూ వ్యాను కింద పడిపోయిన యువతి.. చేతులతో వ్యానుని ఎత్తి కాపాడిన పాదచారులు

  • వీడియో వైరల్
  • చైనాలో ఘటన
  • యువతికి గాయాలు

ద్విచక్ర వాహనంపై వెళుతోన్న ఓ యువతిని వెనుక నుంచి వచ్చిన ఓ వ్యాను ఢీ కొట్టగా ఆమె ఒక్కసారిగా కింద పడిపోయింది. ఆ వ్యాను అలాగే ముందుకు వచ్చి ఆ యువతి మీదుగా వెళ్లడంతో ఆమె దాని కిందే ఉండిపోయింది. దీంతో ఆ వ్యాను డ్రైవర్ నడిరోడ్డుపైనే వాహనాన్ని ఆపాడు. ఈ విషయాన్ని గుర్తించిన పాదచారులు, అక్కడి పోలీసులు వెంటనే ఆ వ్యానును తమ చేతులతో పైకి ఎత్తి ఆ యువతిని బయటకు లాగారు. అనంతరం ఆమెను అంబులెన్సులో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. చైనాలోని అనహుయి ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది.                                                            

More Telugu News