whatsapp: ఇక మీదట వాట్సాప్ లో అడ్మిన్ స్థాయిని తగ్గించేయవచ్చు!

  • అడ్మిన్ గా తొలగించి సభ్యులుగా పరిమితం చేయవచ్చు
  • కొత్త ఫీచర్ ను తొసుకొచ్చిన వాట్సాప్
  • సెట్టింగ్స్ లో రిమూవ్, రిమూవ్ ఏజ్ అడ్మిన్ అనే ఆప్షన్లు

వాట్సాప్ లో మరో నూతన ఫీచర్ వచ్చి చేరింది. ఐవోఎస్, ఆండ్రాయిడ్, వెబ్ వెర్షన్లకు సంబంధించి గ్రూపు అడ్మిన్ ను డీమోట్ చేసే ఫీచర్ ‘డిస్మిస్ ఏజ్ అడ్మిన్’ను ప్రవేశపెట్టింది. అంటే గ్రూప్ అడ్మిన్లుగా ఉన్న వారు గతంలో ఇతర అడ్మిన్లను డిస్మిస్ చేసే సదుపాయం మాత్రమే ఉంది. అయితే అడ్మిన్ గా తొలగించి వారిని సభ్యులుగా పరిమితం చేయడం కొత్త ఫీచర్ తో సాధ్యమవుతుంది. డిస్మిస్ చేయాల్సిన అగత్యం తప్పుతుంది. సెట్టింగ్స్ లోకి వెళితే వారిని తొలగించాలా? లేక కేవలం అడ్మిన్ గానే తొలగించాలా? అన్న ఆప్షన్లు కనిపిస్తాయి. ఇక అధిక ప్రాధాన్యం కలిగిన నోటిఫికేషన్లను ముందు చూపించే విధంగా సెట్టింగ్స్ పెట్టుకునే ఫీచర్ ను సైతం బీటా వెర్షన్ లో చేర్చింది.

More Telugu News