Mahesh Babu: ముఖ్యమంత్రిగా మహేశ్ కనిపించేది కొంతసేపే కాదట!

  • 'భరత్ అనే నేను'తో కొరటాల 
  • ముఖ్యమంత్రి పాత్రలో మహేశ్ 
  • అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి    

కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా రూపొందిన 'భరత్ అనే నేను' రేపు భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మహేశ్ బాబు .. ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని తెలిసిన దగ్గర నుంచి, అలా ఆయన ఎంతసేపు కనిపిస్తాడనే సందేహం అభిమానుల్లో తలెత్తింది.

 ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో కొరటాల మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. కథ మొదలైన మొదటి పావుగంటలోనే మహేశ్ బాబు ముఖ్యమంత్రి అవుతాడనీ, ఆ తరువాత సినిమా మొత్తం ఆయన ముఖ్యమంత్రిగానే కనిపిస్తాడని చెప్పారు. ఇక పూర్తిస్థాయి ముఖ్యమంత్రి పాత్రలో మహేశ్ ఎలా మెప్పిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. కొరటాల .. మహేశ్ ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.       

More Telugu News