reliance jio: 4జీ అందుబాటులో జియో టాప్... డేటా వేగంలో ఎయిర్ టెల్ టాప్!

  • దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 95 శాతం సమయాల్లో అందుబాటు
  • 6 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ వేగంతో ఎయిర్ టెల్ కు మొదటి స్థానం
  • బ్రౌజింగ్ ఫాస్ట్ ఉండేది వొడాఫోన్ లో

4జీ నెట్ వర్క్ అందుబాటు విషయంలో రిలయన్స్ జియోనే నంబర్ 1 స్థానంలో ఉంది. ప్రతీ ప్రాంతంలో సగటున 95 శాతం సమయాల్లో జియో నెట్ వర్క్ అందుబాటులో ఉంటోందని లండన్ కేంద్రంగా పనిచేసే విశ్లేషణ సంస్థ ఓపెన్ సిగ్నల్ తెలిపింది. ఇక పోటీ సంస్థ ఎయిర్ టెల్ 6 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ వేగంతో 4జీ డేటా వేగంలో అగ్ర స్థానంలో ఉంది.

‘‘మా పరీక్షల్లో జియో ఎల్టీఈ సిగ్నల్ 96.4 శాతం సమయాల్లో అందుబాటులో ఉంటోందని తెలిసింది. అంతకుముందు పరీక్షలో వచ్చిన 95.6 శాతానికంటే ఎక్కువే’’ అని తెలిపింది. రిలయన్స్ జియో డేటా డౌన్ లోడ్ వేగం 5.1 ఎంబీపీఎస్. ఇక బ్రౌజ్ చేస్తున్న సమయంలో పేజీలు వేగంగా లోడ్ అయ్యే విషయంలో వొడాఫోన్ ముందుంది. డేటా డౌన్ లోడ్ విషయంలో చాలా తక్కువ లేటెన్సీ నమోదు చేసింది. భారత్ లో ఎల్ఈటీ వేగం మెరుగ్గానే ఉన్నా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 4 సగటు 16.9 ఎంబీపీఎస్ కంటే తక్కువేనని ఓపెన్ సిగ్నల్ పేర్కొంది. 

More Telugu News