Cricket: బీసీసీఐకి జవాబుదారీతనం వుండాలి... లా కమిషన్ సిఫారసు!

  • బీసీసీఐకి షాక్
  •  ఆర్టీఐ పరిధిలోకి బీసీసీఐ
  • ప్రభుత్వానికి సిఫారసు చేసిన లా కమిషన్

బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా)కి జవాబుదారీతనాన్ని కల్పించాలని లా కమిషన్ తాజాగా సూచించింది. బీసీసీఐని ప్రభుత్వ సంస్థగా ప్రకటించి, జవాబుదారీతనం కల్పించేందుకు న్యాయ పరిశీలన సంఘం (లా కమిషన్) ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

 ఈ సిఫారసులు ఆమోదం పొందితే... బీసీసీఐ పబ్లిక్ బాడీ (సార్వజనిక సంస్థ ) అవుతుంది. దీంతో బీసీసీఐ సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుంది. ఆ తరువాత ఈ చట్ట ప్రకారం దరఖాస్తు చేసి కావాల్సిన వివరాలు, సమాచారాన్ని రాబట్టవచ్చు. కాగా, బీసీసీఐ ఇప్పటివరకు తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ప్రైవేటు సంస్థగా పని చేస్తోంది.  

రాజ్యాంగంలోని 12వ అధికరణ ప్రకారం ప్రభుత్వ సంస్థగా బీసీసీఐని ప్రకటించేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని ఇటీవల లా కమిషన్ చైర్మన్ జస్టిస్ బీ ఎస్ చౌహాన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ సిఫారసులు రావడం గమనార్హం.

More Telugu News