Pawan Kalyan: శ్రీరెడ్డిని సమర్థించిన రామ్‌ గోపాల్‌ వర్మ.. సంధ్య, దేవిలాంటి వారు ఆమె తరఫున పోరాడాలని పిలుపు

  • కోపం వచ్చినప్పుడు తిట్లు తిట్టడం సర్వ సాధారణం 
  • పవన్‌ అభిమానులకి కూడా తిట్లు తప్ప ఏమీ రావు
  • శ్రీరెడ్డి పోరాటం గ్రేట్‌
  • ఈ విషయంపై సామాజిక కార్యకర్తలు దృష్టిపెట్టాలి

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను యువనటి శ్రీరెడ్డి దూషించిన తీరుని ఖండిస్తూ ఆమెపై కొందరు విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మాత్రం ఆమె తిట్లను సమర్థించారు. కోపం వచ్చినప్పుడు తిట్లు తిట్టడం అనే విషయం సర్వ సాధారణమని, ప్రతి ఒక్కరూ తిట్లను ఉపయోగిస్తూనే ఉంటారని అన్నారు. ఆ మాటకొస్తే పవన్‌ కల్యాణ్‌కి ఉన్న కొంత మంది అభిమానుల భాష చూస్తే తిట్లు తప్ప వారికి వేరే ఏమీ రావన్నట్లు ఉంటుందని వ్యాఖ్యానించారు.

తాను అందరినీ అనట్లేదని, కొంత మంది పవన్ ఫ్యాన్స్‌ ఇలా మాట్లాడుతుంటారని వర్మ అన్నారు. తాను, తన తల్లి, సోదరి కూడా ఆయనకు ఫ్యాన్సేనని, తాను పవన్‌ని సీఎంగా చూడాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఎప్పటి నుంచో ఉందని, శ్రీరెడ్డి తీసుకున్న నిర్ణయం, చేస్తోన్న పోరాటంతో ఇప్పుడు ఆ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని అన్నారు. ఇప్పుడు ఈ విషయంపై అందరూ చర్చించుకునేలా ఆమె చేసిందని అన్నారు. సామాజిక కార్యకర్తలు సంధ్య, దేవిలాంటి వారు శ్రీరెడ్డి తరఫున పోరాడాలని, ఈ విషయంపై దృష్టిపెట్టి పోరాడాలని వర్మ పిలుపునిచ్చారు.  

More Telugu News