cs: జీవీఏ వృద్ధి, ప్రాధాన్యత ప్రాజెక్టులపై ఏపీ సీఎస్ సమీక్ష

  • గ్రాస్ వాల్యూ ఏడెడ్ వృద్ధి రేటుపై వివరాలు తెలుసుకున్న సీఎస్‌
  • హై ఇంపాక్ట్ ప్రాధాన్యత ప్రాజెక్టులపై పలు ఆదేశాలు
  • కచ్చితమైన డేటా బేస్ ను అందుబాటులో ఉంచుకోవాలని సూచన

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు పారిశ్రామిక, మౌలిక రంగాల్లో జీవీఏ (గ్రాస్ వాల్యూ ఏడెడ్) వృద్ధి రేటు, హై ఇంపాక్ట్ ప్రాధాన్యత ప్రాజెక్టులు అంశాలపై ఈ రోజు అమరావతి సచివాలయంలో ఏపీ సీఎస్‌ దినేష్‌ కుమార్‌ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీవీఏ వృద్ధిరేటు లక్ష్యాలు, సాధించిన ప్రగతిపై ఆయా శాఖలవారీగా వివరాలు తెలుసుకున్నారు.

అన్ని శాఖల్లోను సమాచారం సేకరణ, రిపోర్టింగ్ విధానాలను అన్ని విధాలా మెరుగుపర్చుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు లక్ష్యాలు, సాధనకు సంబంధించిన కచ్చితమైన డేటా బేస్ ను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. జీవీఏకు సంబంధించి సాధించాల్సిన లక్ష్యాలపై కొన్ని మైలురాళ్లను నిర్దేశించుకుని ఆ ప్రకారం నెలవారీ లేక త్రైమాసిక పరంగా సాధించిన ప్రగతిని క్వాలిటేటివ్ గా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
 
రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిర్మాణ రంగ పనులు జరుగుతున్నందున అందుకు సిమెంట్, ఇనుము వినియోగం పెద్ద ఎత్తున జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఎంతమేరకు సిమెంట్, ఇనుము వినియోగం జరిగిందనే అంశంపై ఆయా ఉత్పత్తి కంపెనీల నుండి సమాచారం సేకరించి జీవీఏలో ఈ రంగాన్ని కూడా లెక్కించాల్సిన అవసరం ఉందని తెలిపారు.     

More Telugu News