93 ఏళ్ల అభిమానికి పాదాభివందనం చేసిన సెహ్వాగ్!

- సెహ్వాగ్ ను కలిసేందుకు పాటియాలా నుంచి మొహాలీ వచ్చిన అభిమాని
- అభిమానిని చూసి ఆశ్చర్యపోయిన సెహ్వాగ్
- సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసిన సెహ్వాగ్
అంత పెద్దాయన తనను కలిసేందుకు 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చాడని తెలిసి సెహ్వాగ్ ఆశ్చర్యపోయాడు. ఆయన చూపించిన అభిమానానికి ఫిదా అయిపోయాడు. పెద్దాయన పాదాలకు నమస్కారం చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ట్విట్టర్ లో పంచుకోగా, పెద్ద అభిమానితో దిగిన సెల్ఫీని సెహ్వాగ్ ట్విట్టర్ లో పోస్టు చేస్తూ, ‘ఓం ప్రకాశ్ ను కలవడం చాలా సంతోషంగా ఉంది. 93 ఏళ్ల వయసులో నా కోసం పాటియాలా నుంచి వచ్చారు. నాపై ఎంతో ప్రేమ కురిపించారు. దాదాకో ప్రణామ్’ అని పేర్కొన్నాడు. ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్న సెహ్వాగ్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.