raviteja: 'నేల టిక్కెట్టు' రిలీజ్ విషయంలో ఆలస్యం?

  • కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ
  • ఈ నెలాఖరుకు టాకీ పార్టు పూర్తి 
  • పెండింగులో రెండు పాటలు

దర్శకుడు కల్యాణ్ కృష్ణ రెండు సూపర్ హిట్స్ తరువాత, రవితేజ హీరోగా 'నేల టిక్కెట్టు' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ నెలాఖరు నాటికి ఈ సినిమా టాకీ పార్టును పూర్తిచేసుకోనుంది. మాళవిక కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, మే 25వ తేదీన విడుదల చేయాలనుకున్నారు.

అయితే కథానాయిక మాళవిక కాలు నరం మెలికపడటం వలన, ఆమె ఎక్కువ సేపు నిలబడలేకపోతోందట. ఈ కారణంగానే మిగిలిన రెండు పాటలను చిత్రీకరించడం కష్టంగా మారిందని అంటున్నారు. త్వరలోనే మాళవిక ఈ సమస్య నుంచి బయటపడనుందనీ, ఆ వెంటనే మిగిలిన పాటలను చిత్రీకరించనున్నామని అంటున్నారు. ఈ కారణంగా విడుదల విషయంలో జాప్యం జరిగే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. 

More Telugu News