Nayanatara: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • కథానాయిక ప్రధాన చిత్రంలో నయనతార 
  • జపాన్ ప్రేక్షకులను కలవనున్న రాజమౌళి!
  • మహేశ్ సినిమాకు ప్రీమియర్ షోలు లేవా?

*  అటు స్టార్ హీరోలతో చేస్తూనే, మధ్యలో అప్పుడప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తున్న అందాలభామ నయనతార తాజాగా మరో హీరోయిన్ ప్రధాన చిత్రం చేయడానికి అంగీకరించింది. 'కొట్టాయం కుర్బాన' పేరిట మలయాళంలో రూపొందే ఈ చిత్రంలో నయనతార సరికొత్త తరహా పాత్రలో కనిపిస్తుందట.
* జపాన్ లో కూడా 'బాహుబలి 2' సినిమా తన సత్తా చాటింది. ఇటీవలే అక్కడ నూరు రోజుల ప్రదర్శనను కూడా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ త్వరలో అక్కడికి వెళుతోంది. ఈ చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్లకు వెళ్లి అక్కడి ప్రేక్షకులతో దర్శకుడు రాజమౌళి ఇంటరాక్ట్ అవుతారట.
*  స్టార్ హీరో సినిమా రిలీజవుతుంటే విడుదలకు ముందు రోజు ప్రీమియర్ షోలు వేయడం మామూలే. అయితే ఈ 20న విడుదలవుతున్న 'భరత్ అనే నేను' చిత్రానికి తెలుగు రాష్ట్రాలలో ఎటువంటి ప్రీమియర్ షోలను వేయడం లేదని సమాచారం. అమెరికాలో మాత్రం సుమారు రెండు వేల ప్రీమియర్ షోలను ఏర్పాటు చేస్తున్నారు.  

More Telugu News