jeevitha: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినిమా అభిమానులకు జీవిత రాజశేఖర్‌ బహిరంగ లేఖ

  • నా కుటుంబంపై అసందర్భంగా వ్యక్తిగత ఆరోపణలు చేశారు
  • ఆ టీవీ ఛానెల్‌, మహిళా నాయకురాలిపై చర్యలు
  • సివిల్, క్రిమినల్‌ కేసులకు సిద్ధంగా ఉండాలి
  • అటువంటి ప్రసారమాధ్యమాలను బహిష్కరించాలి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినిమా అభిమానులకు, సామాన్య ప్రజానీకానికి, తన కుటుంబాన్ని అభిమానించే వారికి నమస్కారాలు అంటూ నటి, ప్రొడ్యూసర్‌ జీవిత రాజశేఖర్ ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ నెల 14న టీఆర్పీ రేటింగ్స్‌ కోసం ఓ ప్రముఖ న్యూస్‌ ఛానెల్‌ నిర్వహించిన చర్చ కార్యక్రమంలో ఒక మహిళా నాయకురాలు తన కుటుంబంపై అసందర్భంగా వ్యక్తిగత ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఛానెల్‌ లో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినందుకు సివిల్, క్రిమినల్‌ కేసులకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. తప్పుడు వార్తలు ఇస్తూ టీఆర్పీ రేటింగ్స్‌ కోసం పాకులాడుతోన్న ప్రసార మాధ్యమాలను ప్రజలు బహిష్కరించాలని ఆమె పిలుపునిచ్చారు.  

More Telugu News