jeevitha: ఎల్లుండి మళ్లీ ప్రెస్‌మీట్‌ పెడతాను.. ఆ ఛానెల్‌, సంధ్య గురించి లాయర్‌తో కేసు వివరాలు చెప్పిస్తాను: జీవిత

  • నా వెనుక ఎవరు వచ్చినా రాకపోయినా ముందుకే వెళతా
  • దాసరి నారాయణరావు లేకపోవడం పెద్ద లోటే!
  • ఆయన ఉంటే పరిష్కరించేవారు
  • ఛానెళ్లు తమ రేటింగ్స్‌ పెంచుకోవడానికి కొన్ని ప్రశ్నలు వేస్తాయి

తనపై, తన కుటుంబంపై అసత్య ఆరోపణలను ప్రసారం చేసిన ప్రముఖ న్యూస్‌ ఛానల్‌పైన, సామాజిక కార్యకర్త సంధ్యపైన కేసులు పెడతానని జీవిత రాజశేఖర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇంకా ముందుకు వెళ్లి ఎల్లుండి తమ లాయర్‌తో కలిసి మళ్లీ మీడియా ముందుకు వస్తానని మీడియా సమావేశం చివర్లో జీవిత తెలిపారు. తన వెనుక ఎవరు వచ్చినా, రాకపోయినా తన పోరాటాన్ని కొనసాగిస్తానని అన్నారు. దర్శకుడు దాసరి నారాయణ రావు ఉండి ఉంటే ఈ సమస్యను పరిష్కరించేవారని, ఆయన లేకపోవడం పెద్ద లోటేనని వ్యాఖ్యానించారు.

తాను టీవీల చర్చలకు వెళ్లి చర్చలు జరపబోమని, ఎందుకంటే టీవీ ఛానెళ్లు తమ రేటింగ్స్‌ పెంచుకోవడానికి కొన్ని ప్రశ్నలు వేసి, రేటింగ్స్‌ పెంచుకోవడానికే ప్రయత్నించి కొన్నింటిని మాత్రమే హైలైట్‌ చేసి చూపిస్తాయని అన్నారు. తాను ప్రజలకు నిజాలు తెలపాలనే ఉద్దేశంతోనే ఇలా మీడియా ముందుకు వచ్చానని, టీవీ డిబేట్లకు వెళ్లలేదని అన్నారు.

కాగా, సామాజిక కార్యకర్త సంధ్య వద్ద కొన్ని ఆధారాలు ఉన్నాయట కదా? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. 'ఏ ఆధారాలు చూపెడుతుందో చూపించమనండి, ఆమె ఏం తీసుకొస్తుందో తీసుకురానివ్వండి' అని జీవిత సమాధానం చెప్పారు. ఈ ప్రెస్‌మీట్‌ చూసి తన సినిమా రంగంలోని వారు తనకు మద్దతుగా వస్తారని తాను నమ్ముతున్నానని చెప్పుకొచ్చారు. 

More Telugu News