Andhra Pradesh: చంద్రబాబు నిరశన దీక్షకు పేరు, నినాదం ఖరారు!

  • ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిరశన దీక్ష
  • 'ధర్మపోరాట దీక్ష'గా పేరు 
  • 'నమ్మక ద్రోహం, కుట్రల నుంచి కాపాడుకుందాం' నినాదం
  • ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు దీక్ష

ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయంపై నిరసన తెలపడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 20న తన పుట్టినరోజు సందర్భంగా నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న ఈ దీక్షకు 'ధర్మపోరాట దీక్ష' అనే పేరు పెట్టారు. 'నమ్మక ద్రోహం, కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం' అనే నినాదాన్ని ఈ వేదిక ద్వారా వినిపించనున్నారు.

ఈ నిరశన దీక్ష ఉదయం 7 నుంచి (తొలుత ఉదయం 9 గంటల నుంచి చేయాలనుకున్నారు) రాత్రి 7 వరకు చేయాలని నిర్ణయించారు. ఆ రోజు పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఈ దీక్షపై చర్చించేందుకు అమరావతి సచివాలయంలోని మంత్రి కళా వెంకట్రావు ఛాంబర్‌లో మంత్రులు దేవినేని, లోకేశ్‌, కొల్లు రవీంద్ర, ఆనందబాబు సమావేశం అయ్యారు. 

More Telugu News