panasonic: పానా సోనిక్ నుంచి రూ.7 వేలకే ఫుల్ స్క్రీన్ డిస్ ప్లే మొబైల్

  • ధర రూ.6,999
  • 2జీ ర్యామ్, 16జీబీ స్టోరేజీ
  • 5.45 అంగుళాల 18:9 రేషియో డిస్ ప్లే

ఇప్పుడు ఫుల్ స్క్రీన్ మొబైల్ ఫోన్ల హవా నడుస్తోంది. దాదాపుగా అన్ని కంపెనీలు ఫుల్ స్క్రీన్ డిస్ ప్లేతో ఫోన్లను ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, పానా సోనిక్ మాత్రం బడ్జెట్ ధరలోనే 18:9 రేషియోతో ఫుల్ స్క్రీన్ డిస్ ప్లే ఫోన్ ‘పి101’ ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.6,999. సంగీత మొబైల్స్ ద్వారా ఆఫ్ లైన్ లో కొనుగోలు చేసుకోవచ్చు.

ఈ ఫోన్లో 1.3 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ 6737 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16జీబీ అంతర్గత స్టోరేజీ, 128 జీబీ వరకు మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజీ పెంపు, వెనుక భాగంలో 8 మెగాపిక్సల్ ఆటోఫోకస్ కెమెరా, ఫ్లాష్, ముందు భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. 5.45 అంగుళాల స్క్రీన్  కలిగిన మొబైల్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.1పై పనిచేస్తుంది. 4జీ వోల్టేకు సపోర్ట్, యాసిలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, కంపాస్, యాంబిట్ లైట్ సెన్సార్, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. బరువు 145 గ్రాములు.

More Telugu News