rbi: యూపీ, బీహార్, గుజరాత్ లలో నోట్ల రద్దు నాటి పరిస్థితులు?

  • బ్యాంకులు, ఏటీఎంలలో నిండుకున్న నగదు
  • ఏటీఎంల వద్ద బారులు తీరిన ఖాతాదారులు
  • నగదు కొరతపై ఫిర్యాదులు

దేశంలో మరోసారి నోట్ల రద్దునాటి ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఝార్ఖండ్, గుజరాత్‌ తదితర రాష్ట్రాలతో పాటు చాలా రాష్ట్రాల్లోని బ్యాంకులు, ఏటీఎంలలో నగదులేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ తో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా నగదు కొరతపై ఫిర్యాదులు చేస్తున్నట్టు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. దీనిపై ఆర్బీఐ అధికారులతో కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖాధికారులు సమావేశమయ్యారు.

నగదు లేమిని అవకాశంగా తీసుకున్న పలువురు ‘క్యాష్’ చేసుకుంటున్నారని, 1000 రూపాయల నగదు ఇచ్చేందుకు 100 రూపాయలు డిజిటల్ మార్గాల్లో బదిలీ చేయించుకుంటున్నారని తెలుస్తోంది. మరోపక్క, పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఏటీఎంల వద్దకు బారులు తీరుతున్నారు. మెజారిటీ ఏటీఎంలు నో క్యాష్ బోర్డులతో దర్శనమిస్తుండడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. వివాహ వేడుకల్లో నగదు సమస్యను పరిష్కరించేందుకు పలువురు ఖాతాదారులు తమ పెళ్లి కార్డులను తీసుకుని వెళ్లి నగదు కోసం బ్యాంకు అధికారులను అభ్యర్థిస్తుండడం విశేషం.

More Telugu News