Salman Khan: సల్మాన్ ఖాన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్

  • అనుమతి మంజూరు చేసిన జోధ్ పూర్ కోర్టు
  • కెనడా, అమెరికా, నేపాల్ లో పర్యటన
  • వచ్చే నెల 25 నుంచి జూలై 10వరకు షెడ్యూల్

సల్మాన్ ఖాన్ కు ఊరట లభించింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలంటూ ఆయన చేసిన అభ్యర్థనను కోర్టు మన్నించింది. విదేశీ పర్యటనకు జోధ్ పూర్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ఈ రోజు అనుమతి మంజూరు చేసింది. కృష్ణ జింకల వేట కేసులో శిక్ష పడి బెయిల్ పై ఉన్న సల్మాన్ ఖాన్, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదన్న షరతు ఉంది. దీంతో ఆయన కోర్టు అనుమతి కోరుతూ ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కెనడా, నేపాల్, అమెరికా తదితర దేశాల్లో వచ్చే నెల 25 నుంచి జూలై 10 వరకు సల్మాన్ ఖాన్ పర్యటించేందుకు మార్గం సుగమం అయింది.

More Telugu News