Facebook: వార్తలకు సర్టిఫికేట్లు జారీ చేయనున్న ఫేస్ బుక్.. ఫేక్ న్యూస్ కట్టడికి ప్రయత్నం

  • బూమ్ సంస్ధతో ఒప్పందం చేసుకున్న ఫేస్ బుక్
  • వార్తలను విశ్లేషించి రేటింగ్ ఇచ్చే బూమ్
  • రేటింగ్ ప్రకారం వార్తలో వాస్తవమెంతో తెలుసుకునే వెసులుబాటు

  ‘తప్పుడు వార్తల కట్టడికి మీరెలాంటి చర్యలు తీసుకుంటారు?’ అంటూ ఫేస్‌ బుక్‌ సంస్థను భారత ప్రభుత్వం ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫేక్ న్యూస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని నిరూపించేందుకు ఫేస్ బుక్ కర్ణాటక ఎన్నికల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. ఫేస్‌ బుక్‌ మాధ్యమంగా సర్క్యులేట్‌ అయ్యే వార్తలను విశ్లేషించేందుకు ‘బూమ్‌’ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ అంతర్జాతీయ డిజిటల్‌ వార్తలను విశ్లేషించి, సర్టిఫికెట్లు జారీ చేస్తుంది.

 ఈ సంస్థ కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో యూజర్లు పోస్ట్‌ చేసే వార్తలను ఈ సంస్థ విశ్లేషించి రేటింగ్ ఇస్తుంది. ఈ రేటింగ్ ను ఆ వార్తతో ఫేస్ బుక్ ప్రసారమయ్యేలా చేస్తుంది. దీంతో తక్కువ రేటింగ్ వార్తలను వినియోగదారులు వాస్తవమో, కాదో గ్రహించే వెసులుబాటు ఉంటుందని తెలిపింది. ప్రస్తుతానికి బూమ్ సంస్థ ఆంగ్ల వార్తలను మాత్రమే విశ్లేషిస్తుందని, తరువాత నెమ్మదిగా ఇతర భాషలకు ఈ సేవలు విస్తరిస్తామని ఫేస్ బుక్ తెలిపింది.

More Telugu News