katuva: మరో మలుపు తిరిగిన కథువా రేప్ కేసు... నార్కో టెస్టుకు సిద్ధమన్న నిందితులు!

  • కొట్టి నేరాన్ని ఒప్పించారు
  • న్యాయమూర్తి ముందు ప్రధాన నిందితుడు సంజీ రామ్
  • నార్కో, లై డిటెక్టర్ పరీక్షలు జరపాలని డిమాండ్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువాలో చిన్నారి హత్యాచార ఘటన సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న ఎనిమిది మంది నిందితులూ తాము తప్పు చేయలేదని పోలీసుల విచారణలో స్పష్టంగా చెబుతున్నారని సమాచారం. కావాలంటే తమకు నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని వారు డిమాండ్ చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ కేసు విచారణ ప్రారంభమైన నేపథ్యంలో నిందితులు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. ఎనిమిది మంది నిందితుల్లో పోలీసు అధికారులతో పాటు ఓ మైనర్ బాలుడు కూడా ఉన్న సంగతి తెలిసిందే.

వీరందరినీ న్యాయవాదులు, పోలీసులతో కిక్కిరిసివున్న కోర్టు హాలులో ప్రవేశపెట్టిన వేళ, సెషన్స్ జడ్జి సంజయ్ గుప్త, వారందరికీ చార్జ్ షీట్ కాపీలను అందించాలని ఆదేశించారు. ఇదే సమయంలో తమకు బెయిల్ మంజూరు చేయాలని నిందితులు పెట్టుకున్న పిటిషన్ పై 26న విచారిస్తామని న్యాయమూర్తి వెల్లడించారు. కేసులో ప్రధాన నిందితుడైన రిటైర్డ్ అధికారి సంజీరామ్, తమకు నార్కో టెస్ట్ చేయాలని న్యాయమూర్తికి విన్నవించారు. తనను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కొట్టి నేరాన్ని ఒప్పించారని ఆరోపించారు. తామందరమూ ఈ పరీక్షకు సిద్ధమని తెలిపారు. కాగా, కోర్టు నార్కో టెస్టులపై నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది.

More Telugu News