wasihington sundar: వాషింగ్టన్ సుందర్ జెర్సీ నెంబర్ 555 వెనుక ఉన్న కథ ఇదీ!

  • వాషింగ్టన్ సుందర్ ధరించే జెర్సీ నెంబర్ 555
  • దిగ్గజాలు తమ స్కోరుకు గుర్తుగా పెద్ద సంఖ్యలున్న జెర్సీలు ధరిస్తారు
  • వర్ధమాన ఆటగాడు ధరించడంపై ఆసక్తి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్ రౌండర్ వాషింగ్టన్‌ సుందర్‌ అటు బంతితో పాటు, ఇటు బ్యాటుతో కూడా ఆకట్టుకుంటున్నాడు. 2017 ఐపీఎల్‌ లో రవిచంద్రన్‌ అశ్విన్‌ స్థానంలో రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌స్ జట్టులో ప్రవేశించిన సుందర్ ధరించే జెర్సీ నంబర్‌ 555 ఆసక్తి రేపుతుంది. సాధారణంగా క్రికెట్ లో దిగ్గజ క్రీడాకారులు తాము సాధించిన భారీ స్కోర్లను గుర్తు చేస్తూ ఇలాంటి పెద్ద సంఖ్యలు గల జెర్సీని ధరిస్తుంటారు.

అయితే ఇప్పుడిప్పుడే జట్టులో సత్తాచాటాలని ఉబలాటపడుతున్న కుర్రాడు ఇంత పెద్ద సంఖ్యగల జెర్సీ ధరించడమేంటని పలువురు ఆశ్చర్యపోతుండగా.. వాషింగ్టన్ సుందర్ తన జెర్సీ నెంబర్ 555 వెనుక ఉన్న గుట్టు విప్పాడు. తన పుట్టిన రోజుకు గుర్తుగా ఆ నంబర్‌ జెర్సీని ధరిస్తున్నానని తెలిపాడు. తాను అక్టోబర్‌ 5, ఉదయం 5 గంటల 5 నిమిషాలకు పుట్టానని చెప్పాడు. తాను పుట్టిన క్షణాలకు గుర్తుగా 555 నంబర్‌ జెర్సీని ధరిస్తున్నానని తెలిపాడు. 

More Telugu News