CBI: లాలూ కుటుంబం చుట్టూ బిగుస్తున్న మరో ఉచ్చు.. ఐఆర్‌సీటీసీ కేసులో సీబీఐ చార్జిషీట్

  • రైల్వే మంత్రిగా ‘క్విడ్ ప్రో కో’కు పాల్పడ్డారంటూ లాలుపై ఆరోపణలు
  • నిబంధనలకు వ్యతిరేకంగా సుజాత హోటల్స్‌కు ఖరీదైన భూమి
  • లాలు, రబ్రీ, కుమారుడు తేజస్వీతోపాటు మరో 11 మందిపై చార్జిషీటు

ఆర్జేడీ నేత లాలు ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి, మాజీ సీఎం రబ్రీదేవి, చిన్న కుమారుడు తేజస్వీయాదవ్‌తో పాటు మరో 11 మందిపై ఐఆర్‌సీటీసీ అవినీతి కేసులో సీబీఐ తాజాగా చార్జిషీట్ దాఖలు చేసింది. తేజస్విపై చార్జిషీట్ దాఖలు చేయడం ఇదే తొలిసారి.

యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే మంత్రిగా పనిచేసిన లాలు ప్రసాద్ తన పదవిని దుర్వినియోగం చేశారన్న అభియోగాలు ఉన్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా బీఎన్ఆర్ రాంచి, బీఎన్ఆర్ పూరి అనే రెండు రైల్వే హోటళ్ల నిర్వహణకు సుజాతా హోటల్స్‌కు కాంట్రాక్ట్ ఇచ్చినట్టు సీబీఐ ఆరోపిస్తోంది.

పాట్నాలోని అత్యంత ఖరీదైన ఈ ప్రాంతంలో మూడెకరాల స్థలాన్ని సుజాతా హోటల్స్‌కు కట్టబెట్టినట్టు చెబుతోంది. ఈ హోటళ్ల కోసం అత్యంత చవగ్గా భూమి ఇవ్వడాన్ని తప్పుబట్టిన సీబీఐ ‘క్విడ్ ప్రో కో’లో భాగంగానే ఈ డీల్ జరిగినట్టు ఆరోపిస్తోంది. ఈ హోటల్ ప్రమోటర్లు లాలు కుటుంబానికి చాలా సన్నిహితులని పేర్కొంది. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నట్టు పేర్కొన్న సీబీఐ లాలు కుటుంబ సభ్యులతోపాటు రైల్వే అధికారులపైనా చార్జిషీటు దాఖలు చేసింది.

More Telugu News