సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Tue, Apr 17, 2018, 07:22 AM

- మళ్లీ యూరప్ వెళుతున్న 'క్వీన్'
- బన్నీ సినిమా ఆడియో వేడుకకు ఏర్పాట్లు
- మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట!
* అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'నా పేరు సూర్య' చిత్రం ఆడియో వేడుకను తాడేపల్లిగూడెం సమీపంలోని మిలటరీ మాధవరం గ్రామంలో ఈ నెల 22న నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అనూ ఇమ్మానుయేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు.
* ఇటీవల 'రంగస్థలం' చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు సుకుమార్ త్వరలో మహేశ్ బాబుతో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. ఇందుకు సంబంధించి సుకుమార్ చెప్పిన కథకు మహేశ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.