elephant: అడవి నుంచి తప్పిపోయిన ఏనుగు.. ఇంటిని కూల్చేసిన వైనం!

  • అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగు
  • రూ.70 వేల నష్టం
  • చత్తీస్‌గఢ్‌లో ఘటన

అటవీ ప్రాంతం నుంచి తప్పిపోయి వచ్చిన ఏనుగు ఓ ఇంటిపై దాడి చేసి కూల్చేసిన ఘటన చత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఆ ఏనుగుని చూసిన ఇంట్లోని వారు భయంతో బయటకు పరుగులు తీశారు. ఏనుగు దాడిలో తమకు 70,000 రూపాయల నష్టం వాటిల్లిందని మీడియాకు తెలిపారు. ఈ ఘటన జరుగుతుండగా ఒకరు తమ కెమెరాలో ఈ దృశ్యాలను బంధించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఏనుగు దాడికి గురైన ఇంటిని పరిశీలించి, ఆ ఇంట్లోని వారికి నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు. తమ ప్రాంతంలోకి తరుచూ ఏనుగులు వస్తుండడంతో ఆ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

More Telugu News