banerje: సినీ నటుడు బెనర్జీని పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి

  • బెనర్జీ తండ్రి రాఘవయ్య మృతిపై చిరంజీవి సంతాపం
  • కుటుంబసభ్యులను ఓదార్చిన అగ్ర హీరో
  • రాఘవయ్యతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నమెగాస్టార్ 

టాలీవుడ్ నటుడు బెనర్జీ తండ్రి, సీనియర్ నటుడు రాఘవయ్య నిన్న ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. రాఘవయ్య మృతిపై టాలీవుడ్ ప్రముఖులు పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో, మెగాస్టార్ చిరంజీవి ఈరోజు ఉదయం ఫిల్మ్ నగర్ లోని బెనర్జీ నివాసానికి వెళ్లి పరామర్శించారు. బెనర్జీ కుటుంబసభ్యులను ఓదార్చారు. రాఘవయ్యతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న చిరంజీవి తన సంతాపం వ్యక్తం చేశారు. 

More Telugu News