Makka Maszid: హైదరాబాద్ లో భారీ బందోబస్తు... ఎక్కడ చూసినా పోలీసులే!

  • మక్కా పేలుళ్ల కేసులో తుది తీర్పు
  • నిందితులంతా నిర్దోషులేనన్న ఎన్ఐఏ కోర్టు
  • మరిన్ని బలగాలను రంగంలోకి దించిన పోలీసులు
  • అనుమానితుల తనిఖీ

మక్కా మసీదు పేలుళ్ల కేసులో తీర్పు నిందితులకు అనుకూలంగా రావడంతో, హైదరాబాద్ చుట్టుపక్కల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని కూడళ్లలో ముఖ్యంగా పాతబస్తీ పరిసరాల్లో పొద్దుటి నుంచి 2 వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు శాఖ, తీర్పు తరువాత మరిన్ని దళాలను రంగంలోకి దించింది.

ఈ కేసులో సాక్ష్యాలు లేవంటూ నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు. దీంతో పాతబస్తీలో అల్లర్లు జరగవచ్చన్న ఆందోళన నెలకొనగా, పలు చౌరస్తాల్లో మోహరించిన పోలీసులు, అనుమానితులను తనిఖీలు చేస్తున్నారు. ఈ కేసులో తీర్పు వెలువడిన నేపథ్యంలో ఐదుగురు నిందితులు ఎన్ఐఏ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో తీర్పు అనుకూలంగా రావడం పట్ల వారంతా ఆనందాన్ని వ్యక్తం చేశారు.

More Telugu News