vodafone: వొడాఫోన్, ఐడియా విలీనంతో 5,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన?

  • రెండు సంస్థలకు 21,000 మంది ఉద్యోగులు
  • విలీనం తర్వాత పావు వంతు మందికి ఉద్వాసన
  • నోడల్ బృందం సిఫారసు

వొడాఫోన్, ఐడియా కంపెనీల విలీనం ఉద్యోగుల పాలిట శాపంగా మారనుంది. ఈ రెండు కంపెనీలకు మొత్తం 21,000 మంది ఉద్యోగులు ప్రస్తుతం ఉన్నారు. వీరిలో పావు వంతు మంది ఉద్యోగులు రానున్న నెలల్లో తొలగింపునకు గురయ్యే పరిస్థితి ఉందని అంచనా. ఖర్చులు తగ్గించుకోవడం, సమర్థతను పెంచుకోవడం, కొన్ని బాధ్యతల్లో అవసరానికి మించి ఉన్న ఉద్యోగులను (డూప్లికేషన్) తొలగించడం జరుగుతుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.

 నిజానికి ఈ రెండు సంస్థలు కూడా భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. వీటి రుణ భారం 1,20,000 కోట్లుగా ఉంటుంది. విలీనం కోసం ఏర్పాటు చేసిన నోడల్ బృందం కనీసం 5,000 మందిని తొలగించాలని సూచించింది. విలీనం తర్వాత ఏర్పడే సంస్థ అధిక ఉద్యోగుల భారాన్ని మోసే ఆలోచనలో లేదని సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. జియో ప్రవేశం తర్వాత టెలికం రంగం రూపురేఖలు మారిపోయిన విషయం తెలిసిందే. అప్పటి వరకు ఈ రంగంలో ఉన్న కంపెనీలు జియో తీసుకొచ్చిన విప్లవం నేపథ్యంలో తమ ఉనికిని కాపాడుకునేందుకు పోరాటం చేసే పరిస్థితి ఏర్పడింది.

More Telugu News