allu arjun: బన్నీ సెట్ కి మెగాస్టార్ .. అందరిలోను ఉత్సాహం!

  • ముగింపు దశలో 'నా పేరు సూర్య'
  • ఈ నెల 29న ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • వచ్చేనెల 4న సినిమా విడుదల   

వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' చిత్రం రూపొందుతోంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో కథానాయిక పాత్రను అనూ ఇమ్మాన్యుయేల్ పోషిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోన్న సెట్ కి నిన్న చిరంజీవి వెళ్లారు.

 ఆయన అలా హఠాత్తుగా సెట్ కి రావడం టీమ్ కి ఆనందాశ్చర్యాలను కలిగించింది. వాళ్లంతా కూడా ఆయన రాకపట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా విశేషాలను గురించి అడిగి తెలుసుకున్న చిరంజీవి, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందజేశారు. యూనిట్ సభ్యులతో సరదాగా కొంతసేపు గడిపిన ఆయన, వాళ్ల  కోరికమేరకు వాళ్లతో ఫోటోలు దిగి ముచ్చట తీర్చారు. ఈ నెల 22వ తేదీన ఆడియో రిలీజ్ ను .. 29వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరిపి, వచ్చేనెల 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.        

More Telugu News