South Dakota: సెంట్రల్ యూఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మంచు తుపాను... చలిగాలులు వడగళ్లతో జనజీవనం అతలాకుతలం!

  • గల్ఫ్ తీరం నుంచి గ్రేట్ లేక్స్ వరకూ చలిగాలులు
  • వందలాది విమానాలు రద్దు
  • రెండు రోజుల నుంచి తెరచుకోని సియోక్స్ ఫాల్స్ ఎయిర్ పోర్టు
  • రోడ్లపై 33 సెంటీమీటర్ల మంచు

మధ్య అమెరికాను మంచు తుపాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గల్ఫ్ తీరం నుంచి గ్రేట్ లేక్స్ వరకూ చలిగాలులు, వడగళ్ల వాన, వర్షాలు ముంచెత్తుతుండగా, వసంత రుతువు ప్రారంభ వేళ, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వందలాది విమానాలు రద్దు కాగా, రోడ్లపై అడుగుల మందంతో మంచు పేరుకు పోవడంతో ఎటూ కదల్లేని పరిస్థితుల్లో జనజీవనం అతలాకుతలమైంది. పలు చోట్ల ప్రమాదాలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. లూసియానాలో ఈదురుగాలుల ధాటికి ఓ చెట్టు కుప్పకూలడంతో రెండేళ్ల చిన్నారి మరణించింది. రన్ వేపై మంచును తొలగించే పరిస్థితి లేకపోవడంలో మిన్నియాపోలిస్ లోని సెయింట్ పాల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసి వేశారు.

సౌత్ డకోటాలోని అతిపెద్ద నగరం సియోక్స్ ఫాల్స్ లో గత రెండు రోజులుగా విమానాశ్రయం తలుపులే తీయలేదు. మిన్నియాపోలిస్ లో రోడ్లపై 33 సెంటీమీటర్ల మేరకు మంచు పేరుకుపోవడంతో ఇక్కడ జరగాల్సిన వాలీబాల్ గేమ్స్ ను కూడా రద్దు చేశారు. యాంకీస్, టైగర్స్ నదులు పొంగి ప్రవహిస్తున్నట్టు వార్తా సంస్థలు వెల్లడించాయి. మరింత మంచు కురుస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మిన్నెసోటా, విస్కాన్సిస్, మిచిగాన్ మీదుగా న్యూయార్క్, న్యూ ఇంగ్లండ్ లను తుపాను తాకవచ్చని తెలిపింది.

More Telugu News