Pawan Kalyan: పవన్ కల్యాణ్ కావాలనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు : సబ్బం హరి

  • పవన్ ని మొదట్లో చూసి సీరియస్ పొలిటీషియన్ అనుకోలేదు
  • కాకినాడ మీటింగ్ తర్వాత సీరియస్ గా ఉన్నాడనుకున్నా
  • ప్రస్తుతం పవన్ కల్యాణ్ వైఖరి అర్థంకాకుండా ఉంది

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ని మొదట్లో చూసి సీరియస్ పొలిటీషియన్ అని అనుకోలేదని మాజీ ఎంపీ సబ్బంహరి అన్నారు. ఓ ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ, కాకినాడ మీటింగ్ లో బీజేపీపై పవన్ ధ్వజమెత్తినప్పుడు సీరియస్ గానే ఉన్నాడనిపించిందని అన్నారు. ఆ తర్వాత ఎక్కువ సందర్భాల్లో టీడీపీని సపోర్టు చేశాడని, టీడీపీని విమర్శించకుండా ఉన్నంత వరకూ పవన్ కల్యాణ్ ట్రంప్ కార్డులాగానే తనకు అనిపించాడని చెప్పారు.

ప్రస్తుతం, పవన్ కల్యాణ్ వైఖరి అర్థం కాకుండా ఉందని, అలా, అర్థం కాకుండా ఉండటమే ఆయన వైఖరేమో, ఒకవేళ రహస్య అజెండా ఏమైనా ఆయనకు ఉందేమో అని హరి అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో వెళతాడా? చివర్లో టీడీపీకేమైనా సపోర్టు చేస్తాడా? లేక ఎవరికీ మద్దతు ఇవ్వకుండా సొంతంగా ఉంటాడా? అనేది పవన్ చెప్పకుండా తన తెలివితేటలతో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడని, అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News