Gujarat: క్రితిదాన్ పాడుతుంటే కరెన్సీ నోట్ల వర్షం... వీడియో చూడండి!

  • గుజరాత్ లోని నవ్సారీలో ఘటన
  • గాన ప్రదర్శన చేసిన క్రితిదాన్ గడ్వీ
  • మైమరచిపోయిన ఆహూతులు

గుజరాత్ లోని నవ్సారీ అనే ప్రాంతంలో గాయకుడు కృతిదాన్ గడ్వీ ఓ గాన ప్రదర్శన ఇస్తున్న వేళ, ఆయన గానానికి పులకించి పోయిన ప్రేక్షకులు నోట్ల వర్షాన్ని కురిపించగా, ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. న్యూస్ ఏజన్సీ ఏఎన్ఐ ఈ వీడియోను శనివారం నాడు విడుదల చేసింది.

ఓ యువతి ఏకంగా నోట్ల కట్టను చేత్తో పట్టుకుని, కృతిదాన్ పక్కనే నిలబడి ఒక్కో నోటునూ వదులుతూ ఉండటం, కింద ఉన్న ప్రేక్షకులు కరెన్సీని విసిరేస్తుండటం కనిపించింది. ఓ చిన్న పాప నోట్ల కట్టను తెచ్చి, ఒక్కసారిగా ఆయనపై వేసి వెళ్లిపోవడం కూడా వీడియోలో కనిపిస్తోంది. గడ్వీ ప్రదర్శనల్లో ఈ తరహా దృశ్యాలు సర్వసాధారణమేనని, గతంలో ఆయన ఇచ్చిన ప్రదర్శనల్లోనూ ప్రేక్షకులు కరెన్సీ వర్షం కురిపించారని తెలుస్తోంది.

More Telugu News