VHP: సంచలన నిర్ణయం... వీహెచ్పీ నుంచి బయటకు వచ్చేసిన ప్రవీణ్ తొగాడియా!

  • విశ్వ హిందూ పరిషత్ లో ఎన్నికలు
  • తొగాడియా నామినేట్ చేసిన రాఘవరెడ్డి ఓటమి
  • మనస్తాపంతో పదవులను వదిలేసిన తొగాడియా
  • కొత్త ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా వీఎస్ కోక్జె

గడచిన మూడు దశాబ్దాలకుపైగా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ)లో ముఖ్యుడిగా బాధ్యతలు నిర్వహించిన ప్రవీణ్ తొగాడియా సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీహెచ్పీ నుంచి తాను పూర్తిగా వైదొలగుతున్నట్టు ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో వీహెచ్పీకి అధ్యక్ష ఎన్నికలు జరుగగా, రాఘవరెడ్డి అనే వ్యక్తిని తొగాడియా నామినేట్ చేశారు. అయితే, ఎన్నికల్లో రాఘవరెడ్డి ఓటమిపాలు కావడంతోనే తొగాడియా ఈ నిర్ణయం తీసుకున్నారు.

2011 నుంచి వీహెచ్పీకి తొగాడియా ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇక కొత్త అధ్యక్షుడిగా హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ వీఎస్ కోక్జె ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు రాఘవరెడ్డికి 60 ఓట్లు లభించగా, కోక్జెకు 131 ఓట్లు లభించాయి. దాదాపు 50 సంవత్సరాల తరువాత వీహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగగా, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తొగాడియా ఆరోపించారు. తాను హిందువుల హక్కుల కోసం జీవితాంతం పోరాడుతూనే ఉంటానని తొగాడియా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

More Telugu News