sharwanand: సుధీర్ వర్మ మూవీని చకచకా కానిచ్చేస్తోన్న శర్వానంద్

  • సుధీర్ వర్మతో శర్వానంద్ 
  • కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్
  • కాకినాడలో రెండవ షెడ్యూల్  

ప్రస్తుతం శర్వానంద్ ఒకేసారి రెండు సినిమాలను చేస్తూ వెళుతున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఆయన 'పడి పడి లేచే మనసు' సినిమా చేస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఇక మరో సినిమాను ఆయన సుధీర్ వర్మతో చేస్తున్నాడు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు.

కొన్ని రోజులుగా ఈ సినిమా వైజాగ్ లో షూటింగు జరుపుకుంటోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తూ వస్తున్నారు. ఈ రోజుతో ఈ షెడ్యూల్ షూటింగు ముగిసింది. తరువాత షెడ్యూలను కాకినాడలో ప్లాన్ చేశారు. కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా కల్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది. 

More Telugu News