arun vijay: ఈ విలన్ కి హీరోగా మంచి పేరు రావాలి: ప్రభాస్

  • అరుణ్ విజయ్ హీరోగా 'క్రైమ్ 23'
  • మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యం 
  • త్వరలో భారీస్థాయి విడుదల

తెలుగు .. తమిళ భాషల్లో అరుణ్ విజయ్ విలన్ పాత్రలతో మెప్పిస్తూ వస్తున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో యంగ్ విలన్ గా తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఈ మధ్య ఆయన తమిళంలో హీరోగా 'కుట్రం 23' సినిమాతో హిట్ కొట్టాడు. ఇప్పుడు అదే సినిమాను 'క్రైమ్ 23' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు.

తెలుగు వెర్షన్ కి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా ప్రభాస్ చేతులమీదుగా రిలీజ్ చేయించారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ .. " అరుణ్ విజయ్ తో నాకు మంచి పరిచయముంది .. 'సాహో ' సినిమాలో ఆయన విలన్ గా నటిస్తున్నాడు. ఆయన హీరోగా చేసిన 'క్రైమ్ 23' ట్రైలర్ చూశాను .. చాలా బాగుంది. తమిళంలో సక్సెస్ అయిన ఈ సినిమా .. తెలుగులోను అరుణ్ విజయ్ కి మంచి పేరు తీసుకురావాలి .. నిర్మాతలకు మంచి పేరు రావాలి" అన్నాడు. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.    

More Telugu News