santha: 'రంగస్థలం' కోసం వేసిన సెట్లో ‘సంత’ సినిమా షూటింగ్!

  • ‘రంగస్థలం’ గ్రామం సెట్ లో ‘సంత’ సినిమా
  • ‘సంత’ ఫస్ట్ లుక్ విడుదల 
  •  ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సంత’

ఇటీవల విడుదలైన ‘రంగస్థలం’ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందుతూ, బాక్సాఫీసు రికార్డులు నెలకొల్పుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పక్కనబెడితే, దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’ కోసం నిర్మించిన గ్రామం సెట్ అద్భుతం. ఇదే సెట్ లో దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ ‘సంత’ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

ఓ సంత నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ క్రమంలో ‘రంగస్థలం’ సెట్ లో ‘సంత’ ఫస్ట్ లుక్ ను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్న ‘సంత’ ఓ మంచి సినిమా కావాలని, ప్రేక్షకులను ఆకట్టుకోవాలని కోరుకుంటూ, చిత్రయూనిట్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

More Telugu News